Header Ads

Sbi new rules from 1 April 2017

Sbi new rules from 1 April 2017


స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుండి అమల్లోనికి వస్తాయి
  • మీ యొక్క సేవింగ్ ఖాతా లో మినిమం బ్యాలెన్స్ (కనీస నిలవ) ఉండకపోతే రుసుములు  వసులు చేస్తారు అది 50 నుండి 200 రూపాయలు అంత కంటే ఎక్కువ ఉండచ్చు  
  • మీరు మెట్రో పట్టణాల్లో ఉంటే గనక మినిమం మీ ఖాతాలో 5000 రూపాయలు బ్యాలెన్స్ ఎల్లప్పుడు ఉండాలి 
  • అదే మీరు అర్బన్ (సిటీ / టౌన్ ) ప్రాంతాల్లో ఉంటే గనక మీ ఖాతాలో 3000 రూపాయలు బ్యాలెన్స్ ఎల్లప్పుడు ఉండాలి 
  • అదే మీరు సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉంటే గనక మీ ఖాతాలో 2000 రూపాయలు బ్యాలెన్స్ ఎల్లప్పుడు ఉండాలి
  • అదే మీరు గ్రామీణ  ప్రాంతాల్లో ఉంటే గనక మీ ఖాతాలో 1000 రూపాయలు బ్యాలెన్స్ ఎల్లప్పుడు ఉండాలి\
  • అంతే కాకుండా ఇతర ఎటిఎం ల నుండి  ఒక నెలలో (అంటే  ఎస్ బి ఐ కాకుండా) మూడు సార్ల కంటే ఎక్కువ సార్లు డబ్బులు తీస్తే  20 రూపాయలు ఛార్జ్  కట్ చేస్తారు 
  • అంటే  ఒక నెలలో  కేవలం మూడు సార్లు మాత్రమే డబ్బులు  తీయగలరు ఆ తర్వాత అంటే నాలుగోసారి నుండి ప్రతి సరి 20 రూపాయలు ఛార్జ్ వేస్తారు 
  • అలాగే ఎస్ బి ఐ ఎటిఎం ల లో కూడా ఒక నెలలో  కేవలం ఐదు సార్లు మాత్రమే డబ్బులు తీయగలము ఐదు కంటే ఎక్కువ సార్లు తీస్తే అక్కడ కూడా 10 రూపాయలు ఛార్జ్ వేస్తారు 
  • ఒక వేళ మీ ఖాతాలో 100000 రూపాయలు ఎల్లపుడు బ్యాలెన్స్ ఉంచితే గనక మీరు  ఏ బ్యాంకు ఎటిఎం లో నుండి ఐన ఎన్ని సార్లైనా ఎటువంటి ఛార్జ్ లేకుండా డబ్బులు తీయవచ్చు 
  • ఒకవేళ మీ ఖాతాలో 25000 రూపాయల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంచితే గనక మీరు ఎస్ బి ఐ ఎటిఎం ల లో ఎటువంటి చార్జీలు లేకుండా ఎన్నిసార్లయినా డబ్బులు తీయవచ్చు 
  • అలాగే మూడు నెలల కాలంలో 25000 రూపాయల లోపు బ్యాలెన్స్ వున్నా ఖాతాలో నుండి ఎస్ యమ ఎస్ ఛార్జ్ కొరకు 15 రూపాయలు ఛార్జ్ కట్ చేస్తారు 
  • అంతే కాకుండా ఒక నెలలో కేవలం మూడు సార్లు మాత్రమే డబ్బులు డిపాజిట్ చేయాలి అంతకంటే ఎక్కువ సార్లు డబ్బులు డిపోసిట్ చేస్తే మూడు తర్వాత ఎన్నిసార్లు చేస్తే అన్ని సార్లు 50 రూపాయలు ఛార్జ్ వేస్తారు 
  • అలాగే అదే బ్యాంకులో గనక డబ్బులు తీయాలంటే నెలకి కేవలం నాలుగు సార్లు మాత్రమే తీయగలరు

No comments